రిటైర్మెంట్ సమయంలో సచిన్​కు లారా-గేల్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

|

Nov 17, 2020 | 2:13 PM

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు సచిన్​ టెండుల్కర్​ గుడ్ బై చెప్పి సోమవారానికి(నవంబరు 16) ఏడేళ్లు కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్వీట్ చేసిన మాస్టర్ బ్లాస్టర్...

రిటైర్మెంట్ సమయంలో సచిన్​కు లారా-గేల్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?
Follow us on

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు సచిన్​ టెండుల్కర్​ గుడ్ బై చెప్పి సోమవారానికి(నవంబరు 16) ఏడేళ్లు కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్వీట్ చేసిన మాస్టర్ బ్లాస్టర్… వెస్టిండీస్​పై ఇండియా​ తరపున లాస్ట్ టెస్టు ఆడిన అనంతరం బ్రియాన్​ లారా, క్రిస్​ గేల్​ తనకు స్పెషల్ గిఫ్ట్ అందించారని చెప్పాడు.

“సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున వెస్టిండీస్​ టీమ్‌తో పాటు నా మిత్రులైన బ్రియాన్​ లారా, క్రిస్​ గేల్​ ఈ అందమైన స్టీల్​ డ్రమ్​ను నాకు బహుమతిగా ఇచ్చారు. ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. వారి ప్రేమా అభిమానాలకు ధన్యావాదాలు” అని సచిన్​ పేర్కొన్నాడు.