Sabarimala temple open : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం.. ఇవాళ్టి నుంచి భక్తులకు అనుమతి.. కానీ..

| Edited By: Pardhasaradhi Peri

Dec 31, 2020 | 6:18 AM

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నిన్న సాయంత్రం తెరుచుకుంది.

Sabarimala temple open : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం.. ఇవాళ్టి నుంచి భక్తులకు అనుమతి.. కానీ..
Follow us on

Sabarimala temple open : అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. రోజుకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది దేవస్థానం. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నిన్న సాయంత్రం తెరుచుకుంది. ఈరోజు ఉదయం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థాన్ స్పష్టం చేసింది. జనవరి 14న మకరవిళక్కు వస్తుంది. అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. కరోనా నిబంధనల కారణంగా మకరవిళక్కు సీజన్‌లో రోజుకు కేవలం 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతించనున్నాయి.

అయితే, ముందుగా రోజుకు 2 వేల మంది భక్తులను మాత్రమే అనుమతి ఉండేది. కోర్టు అనుమతితో భక్తుల సంఖ్య పెంచారు. అయితే దర్శనానికి వచ్చే అయ్యప్ప భక్తులు కోవిడ్‌ -19 నెగిటివ్‌ రిపోర్టుతో వస్తేను అయ్యప్ప దర్శనానికి అనుమతి ఇస్తారు. కోవిడ్‌ ఉన్నందున దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. అలాగే శబరిమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే అనుతించరు. కాగా, కరోనా నేపథ్యంలో ఈ సారి దీక్షలు సైతం తక్కువగానే వేశారు. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది తక్కువ మంది భక్తులు మలాధారణ వేశారు.

ఇదిలావుంటే, ఈసారి మకర దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కోవిడ్‌ ఉన్నా.. భక్తుల సంఖ్యలో తగ్గుదల లేదంటున్నాయి ఆలయ వర్గాలు. మకరజ్యోతి దర్శనాన్ని వైభవంగా నిర్వహిస్తామంటున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.