విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ చివరిసారిగా రణరంగంలో సినిమాలో కనిపించారు. ఏ పాత్రలోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోతాడు. ఒక సాహోలోనూ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో మురళి శర్మ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
బాహుబలితో ప్రభాస్ చాలా ఎత్తుకు ఎదిగిపోయాడని మురళి శర్మ అన్నారు. సాహో మూవీని తన కుటుంబసభ్యులతో కలిసి చూడటానికి వెయిట్ చేస్తున్నానన్నారు. అంతేకాదు ప్రభాస్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమాతోనే తెలిందన్నారు. తాను ప్రభాస్‌ని యూనివర్సల్ డార్లింగ్ అని పిలుస్తానని చెప్పారు. దర్శకుడు సుజీత్ ఒక మేధావి మెదడు ఉన్న చిన్న పిల్లవాడు. అతను అద్భుతంగా స్క్రిప్ట్ రాసిన వండర్ కిడ్ అంటూ కితాబిచ్చారు. తాను భాగమతి సినిమాలో చేస్తున్నాప్పుడు.. సాహో స్కిప్టును సుజీత్ వినిపించారని తనకు బాగా నచ్చిందని చెప్పారు.