తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 15 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం..

రైతుబంధు కోసం పట్టాదారు పాసుపుస్తకం వచ్చి బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ ఇవ్వని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రైతులు తమ బ్యాంకు అకౌంట్‌ వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 15 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం..

Edited By:

Updated on: Jul 13, 2020 | 6:44 AM

Rythu bandhu application extended: రైతుబంధు కోసం పట్టాదారు పాసుపుస్తకం వచ్చి బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ ఇవ్వని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రైతులు తమ బ్యాంకు అకౌంట్‌ వివరాలు సంబంధిత క్లస్టర్‌ ఏఈఓ లేక ఏఓలకు అందజేసి రైతు బంధు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. కాగా.. గతంలో పాస్‌పుస్తకం వచ్చి బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ ఇవ్వని రైతులు తమ బ్యాంకు అకౌంట్‌, పాస్‌పుస్తకం మొదటి పేజీ, ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్‌ సంబంధిత ఏఈఓ లేదా ఏఓలకు అందజేయాలని పేర్కొంది.

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!