
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. పారిశ్రామిక వేత్తలు, దేశాధినేతలు సైతం వణికిపోతున్నారు. తాజాగా రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్టిన్ కరోనా బారినపడ్డారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. గురువారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మిఖైల్ మిషుస్టిన్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తరువాత.. కరోనాతో బాధపడుతున్న రెండవ ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్.
మరోవైపు.. రష్యాలో ఇప్పటి వరకు 106,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,619 మంది కోలుకోగా.. 1,073 మంది మరణించారు. ప్రస్తుతం రష్యాలో 93,806 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 2,300 మంది పరిస్థితి విషమంగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
[svt-event date=”30/04/2020,11:09PM” class=”svt-cd-green” ]
«Тесты, которые я сдал, дали положительный результат. Я должен соблюдать самоизоляцию»: Мишустин доложил Путину, что у него обнаружен коронавирус. И.о. премьера назначен Белоусов pic.twitter.com/IRgAvfKA0E
— Дмитрий Смирнов (@dimsmirnov175) April 30, 2020