రష్యా ప్రయోగాత్మకంగా అత్యంత శక్తిమంతమైన అణుబాంబును ప్రయోగించి చూసింది. లోగడ జపాన్ లోని హిరోషిమాపై జారవిడిచిన బాంబుకన్నా ఇది 3333 రెట్లు పవర్ ఫుల్ బాంబు అని ఆ దేశం తెలిపింది. రష్యా న్యూక్లియర్ ఇండస్ట్రీ 75 వ యానివర్సరీని పురస్కరించుకుని ఈ అణుబాంబును ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. దీని ప్రభావం వల్ల భూకంపం కూడా సంభవిస్తుందని అంటున్నారు. అణు పరీక్షలపై నిషేధం ఉన్నప్పటికీ రష్యా ఈ పరీక్షను నిర్వహించడం విశేషం.