భారత్‌కు మద్దతు ప్రకటించిన రష్యా

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:24 PM

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడి 40 మంది భారత సీఆర్పిఎఫ్ జవాన్లను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దాని బాస్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న ప్రయత్నానానికి క్రమంగా సపోర్ట్ పెరుగుతోంది. నిన్న ఫ్రాన్స్ దేశం మద్దతు తెలపగా, తాజాగా రష్యా కూడా తన మద్దతు ప్రకటించింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఇండియా […]

భారత్‌కు మద్దతు ప్రకటించిన రష్యా
Follow us on

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడి 40 మంది భారత సీఆర్పిఎఫ్ జవాన్లను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దాని బాస్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న ప్రయత్నానానికి క్రమంగా సపోర్ట్ పెరుగుతోంది.

నిన్న ఫ్రాన్స్ దేశం మద్దతు తెలపగా, తాజాగా రష్యా కూడా తన మద్దతు ప్రకటించింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఇండియా వాదనకు మేము కచ్చితంగా మద్దతు తెలుపుతున్నామని రష్యా మంత్రి డెనిస్ మాంటురోవ్ తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు మా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని అన్నారు.