rrr teaser break new record: యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాయడం మొదలు పెట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వస్తోన్న ప్రతీ అప్‌డేట్ సోషల్ మీడియాలో సంచనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది.
ఇదిలా ఉంటే దసరా కానుకగా చిత్ర యూనిట్ ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ అరుదైన రికార్డును సంపాదించుకుంది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్‌కు ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఈ స్థాయిలో కామెంట్లు దక్చించుకున్న తెలుగు టీజర్‌గా ‘రామ రాజు ఫర్ భీమ్’ రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియోను ఇప్పటి వరకు 3.5 కోట్లకు పైగా వీక్షించగా, 12 లక్షలకుపైగా లైక్‌లను సొంతం చేసుకుంది. విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతోన్న ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.