జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు ఆరంభంకానుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ టీమ్ తో మళ్ళీ ఎప్పుడు కలుస్తాడన్నదని పైన స్పష్టత లేదు. అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. బుధవారం రోహిత్ మెల్‌బోర్న్‌లో ఉన్న భారత జట్టుతో కలుస్తాడని రవిశాస్త్రి తెలిపారు. నిర్ణయం తీసుకునేముందు ముందుగా అతని అభిప్రాయాన్ని తెలుసుకుంటామని అన్నారు. మూడో టెస్టులో రోహిత్ ఆడే విషయమై టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతోంది. ‘రోహిత్ రేపు జట్టులో చేరుతాడు అని రవిశాస్త్రి అన్నారు. గతకొన్ని రోజులుగా అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు కాబట్టి ముందుగా అతడితో మాట్లాడి తన ఫిజికల్ ఫిట్‌నెస్‌పై చర్చించి, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని’ రవిశాస్త్రి అన్నారు.
Also Read :
Australia vs India : గాయం కారణంగా మూడో టెస్ట్ కు ఉమేష్ యాదవ్ దూరం.. అతని స్థానంలో ఎవరంటే..