IPL 2024: హైదరాబాద్ చేతిలో ఓటమి.. రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ !

. బుధవారం (మార్చి 27) రాత్రి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక బాదుతూ హైదరాబాదీ బ్యాటర్లు ఏకంగా 277 పరుగులు చేశారు. అనంతరం బ్యాటర్లు ధాటిగానే ఆడినా లక్ష్యం మరీ ఎక్కువైపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ముంబై జట్టు యజమాని ఆకాష్ అంబానీ రోహిత్ శర్మను కలిశాడు

IPL 2024: హైదరాబాద్ చేతిలో ఓటమి.. రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ !
Mumbai Indians
Follow us

|

Updated on: Mar 28, 2024 | 6:29 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) చరిత్రలో ముంబై ఇండియన్స్ జట్టు చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబైపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. బుధవారం (మార్చి 27) రాత్రి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక బాదుతూ హైదరాబాదీ బ్యాటర్లు ఏకంగా 277 పరుగులు చేశారు. అనంతరం బ్యాటర్లు ధాటిగానే ఆడినా లక్ష్యం మరీ ఎక్కువైపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ముంబై జట్టు యజమాని ఆకాష్ అంబానీ రోహిత్ శర్మను కలిశాడు. వీరి మధ్య సుదీర్ఘ చర్చలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది. కానీ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు అందించిన అపఖ్యాతిని మూటగట్టుకోవడం ఆ ఫ్రాంచైజీని తీవ్రనిరాశకు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఓనర్లు ఆకాష్ అంబానీ, నీతా అంబానీలు రోహిత్ శర్మతో జట్టు పరిస్థితిపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని, మళ్లీ రోహిత్ కే పగ్గాలు కట్టబెడతారంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 277 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున హెన్రిక్ క్లాసెన్ అజేయంగా 80 పరుగులు చేశాడు. 34 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అభిషేక్ శర్మ 63 పరుగులతో, ట్రావిస్ హెడ్ 62 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. బదులుగా భారీ లక్ష్య ఛేదనలో ముంబై 246 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ ఇన్నింగ్స్ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లను పరిశీలిస్తే.. పీయూష్ చావ్లా 2 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. షమ్స్ ములానీ 2 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. మఫాకా 4 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు.

రోహిత్ తో మాట్లాడుతున్న ఆకాశ్ అంబానీ.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో