రైలులో విష ప్రయోగం.. సొమ్ముతో దొంగల పలాయనం..

| Edited By:

Apr 15, 2019 | 11:42 AM

యశ్వంత్‌పూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుపై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికులపై విషప్రయోగం చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఆరుగురు ప్రయాణికులకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ ఇచ్చి వారి దగ్గర నుంచి బంగారు నగలు, డబ్బు దోపిడీ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను రైల్వే సిబ్బంది వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ఢిల్లీకి చెందిన నితిన్ జైన్, రాహుల్, ప్రేమ్ శంకర్, టింకు, భురేఖాన్, అబ్బాస్ అనే ఆరుగురు ప్రయాణికులు […]

రైలులో విష ప్రయోగం.. సొమ్ముతో దొంగల పలాయనం..
Follow us on

యశ్వంత్‌పూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుపై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికులపై విషప్రయోగం చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఆరుగురు ప్రయాణికులకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ ఇచ్చి వారి దగ్గర నుంచి బంగారు నగలు, డబ్బు దోపిడీ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను రైల్వే సిబ్బంది వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు.

ఢిల్లీకి చెందిన నితిన్ జైన్, రాహుల్, ప్రేమ్ శంకర్, టింకు, భురేఖాన్, అబ్బాస్ అనే ఆరుగురు ప్రయాణికులు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరితో పాటు కంపార్ట్‌మెంట్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. వారిద్దరు వీరితో మాటలు కలిపారు. తరువాత మత్తు మందు కలిపిన బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ వీరికి ఇచ్చారు. ‌

బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ తాగిన ఆరుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తరువాత దోపిడీ దొంగలు వారి ఒంటి మీద ఉన్న బంగారం, జేబులో ఉన్న డబ్బు దోచుకొని ఉడాయించారు. సహ ప్రయాణికులు వీరిని గుర్తించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగుర్ని వరంగల్ రైల్వేస్టేషన్‌లో దింపారు. ప్రత్యేక అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.