AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ కొందరి దిష్టి బొమ్మ- ప్రకాష్ రాజ్

బీజేపీ పార్టీ.. వెనకవుండి నడిపిస్తున్న కొంతమందికి దిష్టి బొమ్మ మాత్రమే అని సినీ నటుడు, బెంగుళూరు సెంటర్ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను పదే పదే హిందువు వ్యతిరేకి అని ముద్ర వేస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు. నేను అమిత్ షాకు వ్యతిరేకి, మోదీకి వ్యతిరేకి అన్న ఆయన..కమ్యునల్ హింసకు పాల్పడుతున్న వారు నిజమైన హిందువులు కాదన్నారు. ‘టీవీ9’ నిర్వహించే ఎన్‌కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  […]

బీజేపీ కొందరి దిష్టి బొమ్మ- ప్రకాష్ రాజ్
Ram Naramaneni
|

Updated on: Apr 15, 2019 | 11:30 AM

Share

బీజేపీ పార్టీ.. వెనకవుండి నడిపిస్తున్న కొంతమందికి దిష్టి బొమ్మ మాత్రమే అని సినీ నటుడు, బెంగుళూరు సెంటర్ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను పదే పదే హిందువు వ్యతిరేకి అని ముద్ర వేస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు. నేను అమిత్ షాకు వ్యతిరేకి, మోదీకి వ్యతిరేకి అన్న ఆయన..కమ్యునల్ హింసకు పాల్పడుతున్న వారు నిజమైన హిందువులు కాదన్నారు. ‘టీవీ9’ నిర్వహించే ఎన్‌కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో చెప్పకుండా, చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా..బాలకోట్, ఫుల్వామా ఇన్సిడెంట్ల గురించి బీజేపీ నాయకులు చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రజలకు సరైన పాలన అందించడంలో ఫెయిల్ అయ్యాయని ఆరోపించారు. బెంగుళూరు లాంటి సిటీలో త్రాగునీరు కొరత ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకొచ్చారు. కాలుష్యం, పేదరికం పెరిపోయిందన్నారు. తానెప్పటికి ప్రజాపక్షమే అన్న ప్రకాష్ రాజ్…ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన ఆలోచనలతో ఏకీభవించిన వారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్నికలపై స్పందించిన ఆయన..ఓట్లంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు పండుగని..అలాంటి సమయంలో ముగ్గురు చనిపోవడం తనకు బాధ కలిగించిందని చెప్పారు.ఎన్నికల్లో పోటీ అనేది అంశాల పట్ల ఉండాలి గానీ..వ్యక్తిగతంగా కాదని  అన్నారు. చంద్రబాబు కూడా కాస్త దిగజారినట్టు అనిపించిందని వ్యాఖ్యానించారు.

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు