Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి

|

Dec 20, 2020 | 11:08 AM

 తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో  ద్విచక్ర వాహనాన్ని కంటైనర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు.

Road Accident :  తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి
Follow us on

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో  ద్విచక్ర వాహనాన్ని కంటైనర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. తునిలో ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో దుర్గ (10), తాతాజీ(15) స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. బాధితులు విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన వారిగా గుర్తించారు. కాగా, ప్రమాదం నుంచి చిన్నారుల తండ్రి క్షేమంగా బయటపడ్డాడు. తన కళ్ల ముందే ఇద్దరు బిడ్డలు మృతి చెందడంతో ఆ తండ్రి వేదన చూపరులను కన్నీరు పెట్టించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా పాజిటివ్.. చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిక..