పది లక్షల ఉద్యోగాలను ఇచ్చి తీరుతాం :తేజస్వీ యాదవ్‌

|

Oct 27, 2020 | 4:46 PM

తాము అధికారంలోకి రావడం ఖాయమని, పది లక్షల ఉద్యోగాలను కల్పించి తీరుతామని చెప్పుకొచ్చారు రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వీ యాదవ్‌… బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో మహాగడ్బంధన్‌ బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుందని కొండంత ఆత్మవిశ్వాసంతో చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన మొదటి ప్రాధాన్యత అని అన్నారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం పది లక్షల ఉద్యోగాలను కల్పించే ఫైల్‌పైనేనని తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తొలగించాలంటూ […]

పది లక్షల ఉద్యోగాలను ఇచ్చి తీరుతాం :తేజస్వీ యాదవ్‌
Follow us on

తాము అధికారంలోకి రావడం ఖాయమని, పది లక్షల ఉద్యోగాలను కల్పించి తీరుతామని చెప్పుకొచ్చారు రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వీ యాదవ్‌… బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో మహాగడ్బంధన్‌ బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుందని కొండంత ఆత్మవిశ్వాసంతో చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన మొదటి ప్రాధాన్యత అని అన్నారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం పది లక్షల ఉద్యోగాలను కల్పించే ఫైల్‌పైనేనని తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తొలగించాలంటూ బీహార్‌ అసెంబ్లీలో తమ ప్రభుత్వం తీర్మానం చేపడుతుందన్నారు. చాలా నియోజకవర్గాలలో జేడీయూ-బీజేపీ కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. వచ్చే నెల పదో తేదీ నుంచి బీహార్‌లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని తేజస్వీయాదవ్‌ తెలిపారు. నితీశ్‌కుమార్‌ పాలనలో బీహార్‌ భ్రష్టుపట్టిపోయిందన్నారు.. విద్య, వైద్య రంగాలతో పాటు ఉపాధి కల్పన కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యిందని విమర్శించారు తేజస్వీ. వీటిని పునరుద్ధరించే బాధ్యతను తాము చేపడతామని చెప్పారు. బీహార్‌లో రేపు తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి.. వచ్చే నెల మూడున రెండో దశ ఎన్నికలు, ఏడున మూడో దశ ఎన్నికలు జరుగుతాయి.. నవంబర్‌ పదిన కౌంటింగ్‌ జరుగుతుంది..