ఆంక్షల సడలింపు ఫలితం, ఢిల్లీలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు
ఆంక్షలను సడలించిన ఫలితంగా ఢిల్లీలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 2,737 కేసులు నమోదయ్యాయి. 67 రోజుల తరువాత మళ్ళీ ఇన్ని కేసులు నమోదు కావడం..

ఆంక్షలను సడలించిన ఫలితంగా ఢిల్లీలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 2,737 కేసులు నమోదయ్యాయి. 67 రోజుల తరువాత మళ్ళీ ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1,82,306 కి చేరినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య నాలుగున్నర వేలకు పెరిగింది. ఆంక్షల సడలింపుతో బాటు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రజలవల్ల కూడా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.



