జనవరి 21, 2020 న ప్రపంచవ్యాప్తంగా జాతీయ హగ్ డే జరుపుకున్నారు. జాతీయ కౌగిలింతల దినోత్సవం సందర్భంగా రిచాచద్దా కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కానీ ఆమె జరుపుకునే విధానం భిన్నంగా ఉంది.ముంబయి వీధిలో వెళ్తున్న అపరిచితులకు కౌగిలింతలు ఇచ్చారు. చేతిలో ‘ఫ్రీ హగ్స్’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని మరీ అందర్నీ ఆప్యాయంగా పలకరించారు.
రిచా క్యాప్షన్‌లో.. ‘ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉంది.. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలి అనుకున్నా. నేను అపరిచితుల్ని కౌగిలించుకున్నా.. ఇది ఓ మ్యాజిక్‌లా అనిపించింది. ప్రతి ఏడాది ఇలా చేయాలి అనిపిస్తోంది. వచ్చే ఏడాది మీరు నన్ను కలవొచ్చు..’ అని పేర్కొంది.