
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాపై దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత నట్టికుమార్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. సినిమాను సినిమా లాగ మాత్రమే చూడాలని.. చట్టాలకు లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఎవ్వరి మనోభావాలను కించపరచే విధంగా సినిమాను తీయడం లేదన్న నట్టి.. దిశ బయోపిక్ తాము తీయడం లేదని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మళ్ళీ జరగకూడదని చట్టానికి, న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం దిశ తల్లిదండ్రులు ఎవ్వరిని సంప్రదించలేదని తెలిపారు.
నవంబర్ 26 న దిశ ఎన్ కౌంటర్ చిత్రం రీలీజ్ చేస్తున్నామని.. కోర్టు ఎలా తీర్పు ఇస్తే దానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. దిశ కమిషన్ కు సంబంధించిన విషయాలు చిత్రంలో ఏమి చెప్పలేదన్నారు. సినిమా ట్రైలర్ మీద పోకిరీలు పెట్టె కామెంట్స్ పై తాము ఏమి స్పందించలేమన్న ఆయన.. పోలీసులు సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. వర్మ వచ్చిన తర్వాత ఈ ‘దిశ’ చిత్రం పై పూర్తి వివరాలు వెల్లడిస్తారని అన్నారు. వర్మా..! ఏమిటి నీ అరాచకం.? : దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి