ఐపీఎల్: మినీ ఆక్షన్‌కు ముందు సీఎస్‌కే కీలక నిర్ణయం.. కేదార్ జాదవ్ అవుట్.? ఆ ఇద్దరిపైనే గురి.!

Kedar Jadhav IPL 2021: ఐపీఎల్ 14పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో మినీ వేలం నిర్వహించాలని యోచిస్తోంది...

ఐపీఎల్: మినీ ఆక్షన్‌కు ముందు సీఎస్‌కే కీలక నిర్ణయం.. కేదార్ జాదవ్ అవుట్.? ఆ ఇద్దరిపైనే గురి.!
Follow us

|

Updated on: Jan 08, 2021 | 8:01 PM

Kedar Jadhav IPL 2021: ఐపీఎల్ 14పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో మినీ వేలం నిర్వహించాలని యోచిస్తోంది. దీనితో జనవరి 21వ తేదీ లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వేలంలో ఉద్వాసన పలికే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేసి పంపించాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపధ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఘోరంగా వైఫల్యం చెందిన ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌తో పాటు స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లాను సీఎస్‌కే విడిచి పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరి కొంతమంది క్రికెటర్లను సైతం ఉద్వాసన పలికే ఆలోచనలో టీం యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మాలన్, వచ్చే ఏడాదితో కాంట్రాక్ట్ పూర్తవుతున్న సురేష్ రైనాలపై సీఎస్కే గురి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, కేదార్ జాదవ్ గత సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 62 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్ కూడా కొట్టని విషయం విదితమే.