
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) యాజమాన్యంలోని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్), ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను సుమారు రూ.620 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో.. ఈకామర్స్ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం ప్రవేశించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జియోమార్ట్ పేరుతో ఆన్‌లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆర్‌ఐఎల్ డీల్ ప్రకారం నెట్‌మెడ్స్ విలువను రూ. 1,000 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేశారు.
ఇటీవలే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. బెంగళూరులో ఆన్‌లైన్ ఫార్మసీ విక్రయాలు ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఆర్‌ఐఎల్ నెట్‌మెడ్స్ కొనుగోలుతో పోటీ వేడెక్కనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా నెట్‌మెడ్స్, ఫార్మ్‌ఈజీ, మెడ్‌లైఫ్ తదితర పలు కంపెనీలు ఆన్‌లైన్ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
Read More:
ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్ ఐసోలేషన్..!
జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!