
Reduced Flood to Srisailam Reservoir : ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. దీంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 75,054 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 832.40 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 52.0555 టీఎంసీలున్నాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉంది. మరో వారం రోజుల పాటు వరద ప్రవాహం పెరిగినా.. శ్రీశైలం జలాశం పూర్తిగా నిండుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.