Red Movie New Lyrical Video Out: ‘ఈస్మార్ట్ శంకర్’తో 2020లో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో రామ్. ఇక ఈ ఏడాదిలోనూ అదే ఊపును కొనసాగించాలని డిసైడ్ అయిన ఈ కుర్రహీరో ‘రెడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ హీరోగా నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ రామ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ‘రెడ్’ సినిమాలోని ‘డించాక్’ అనే మాస్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రామ్ మాస్ డ్యాన్స్‌తో రెచ్చి పోయాడు. మరోసారి ఈస్మార్ట్ శంకర్‌లోని టైటిల్ సాంగ్‌ను గుర్తుచేశాడు. ఇక ఈ ప్రత్యేక గీతంలో హీరోయిన్ హెబ్బా పటేల్ తళుక్కుమంది. తన హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారు మతిపోగొడుతోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Also Read: Nayanthara : ఆ సినిమాలో నయనతార నటించడంలేదు.. పుకార్లు నమ్మకండి.. క్లారిటీ ఇచిన టీమ్