Bigg Boss 4: రియాలిటీ షోల్లో గెలిచిన డబ్బును రియల్ గా ఇస్తారా ..? నెటిజన్స్ లో సందేహాలు.. అసలు విషయం ఏంటంటే … 

|

Nov 29, 2020 | 12:43 PM

తెలుగులో బిగ్ బాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా నాలుగో సీజన్ ప్రసారం అవుతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు , టాస్క్లు , ఏడుపులు  మద్యమద్యలో నాగార్జున వార్నింగ్లతో బిగ్ బాస్ ఆసక్తిగా సాగుతుంది...

Bigg Boss 4: రియాలిటీ షోల్లో గెలిచిన డబ్బును రియల్ గా ఇస్తారా ..? నెటిజన్స్ లో సందేహాలు.. అసలు విషయం ఏంటంటే ... 
Follow us on

తెలుగులో బిగ్ బాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా నాలుగో సీజన్ ప్రసారం అవుతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, టాస్క్లు, ఏడుపులు  మద్యమద్యలో నాగార్జున వార్నింగ్లతో బిగ్ బాస్4 ఆసక్తిగా సాగుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 4 చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది  రోజుల్లో ఈ సీజన్ పూర్తవబోతుంది. మిగిలిన ఇంటిసభ్యుల్లో ఎవరు విజేత అవుతారని అందర్లోనూ ఆసక్తి మొదలైంది. ప్రతివారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్న నేపథ్యంలో చివరికి ఎవరు మిగులుతారు..? ఎవరు విజేత అవుతారని ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. అయితే రియాలిటీ  గేమ్ షోల్లో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ప్రైజ్ మనీలు కూడా ఉంటాయి.

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లాంటి గేమ్ షోలతో లక్షాధికారులు అయిన వారుకూడా ఉన్నారు. బిగ్ బాస్ గేమ్ షో ద్వారా కూడా కంటిస్టెంట్స్ కు ప్రైజ్ మనీ ఉంటుంది. హౌస్ లో ఉండే కంటెస్టెంట్ కు ఉన్న క్రేజ్ ను బట్టి వారి పారితోషకం నిర్ణయిస్తారు. దీనితో పాటు విజేతలుగా నిలిచిన వారికి భారీగా ప్రైజ్ మనీ ముట్టజెపుతారు. అయితే గెలిచిన మొత్తాన్ని విన్నర్స్ కి ఇస్తారా..? అనే అనుమానం చాలా మందిలో ఉంది. నిజంగా అంతా డబ్బు ఇస్తారా..? ఇదంతా గేమ్ ప్లాన్, టీఆర్ఫీ కోసం చేసే స్టంట్లు అంటూ కొట్టిపారేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇన్ కమ్ ట్యాక్స్  రూల్స్  ప్రకారం రియాల్టీ షోలో గెలిచిన మొత్తం నుండి దాదాపుగా 45 శాతంను పన్నుల రూపంలో ప్రభుత్వంకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సదరు ఛానల్స్ ఆ పన్నులను భరించకుండా కంటెస్టెంట్స్ నుంచి వసూలు చేస్తారు. లక్షల్లో డబ్బులు వచ్చాయని ఆనందపడేలోగా ఇన్ కమ్ ట్యాక్స్ రూపంలో సగం డబ్బులు పోతాయని బాధపడుతుంటారు కంటెస్టెంట్స్.

అమిత్ షా హైదరాబాద్ టూర్ లైవ్ అప్ డేట్స్ కోసం దిగువ లింక్ ను క్లిక్ చేయండి.