రాణించిన పడిక్కల్‌ ..ఢిల్లీ టార్గెట్ 153

|

Nov 02, 2020 | 9:30 PM

అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ మోస్తారు స్కోరు చేసింది.

రాణించిన పడిక్కల్‌ ..ఢిల్లీ టార్గెట్ 153
Follow us on

అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ మోస్తారు స్కోరు చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో, 5×4), డివిలియర్స్‌ (35; 21 బంతుల్లో, 1×4, 2×6) రాణించడంతో ఢిల్లీకి బెంగళూరు 153 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 రన్స్ చేసింది. అయితే బెంగళూరుకు మెరుగైన ఆరంభం దక్కలేదు. ఫిలిప్‌ (12; 17 బంతుల్లో, 1×4)ను రబాడ ఔట్‌ చేయడంతో 25 పరుగులకే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లీ (29; 24 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి పడిక్కల్‌ ఇన్నింగ్స్‌ను నిలకడగా ముందుకు తీసుకెళ్లాడు.  అయితే దూకుడుగా ఆడే క్రమంలో కోహ్లి ఔటయ్యాడు. అనంతరం పడిక్కల్‌, మోరిస్‌ (0) కూడా ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు చేరడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దూబె (17; 11 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి డివిలియర్స్‌ ఇన్సింగ్స్‌ను నడిపించాడు. తొలుత వీరిద్దరు ఆచితూచి ఆడినా తర్వాత జోరు పెంచారు.అయితే దూకుడుగా ఆడే క్రమంలో స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె మూడు, రబాడ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

Also Read :

క్షణికావేశంలో భర్తను, అత్తమామలను చంపిన మహిళ

సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగింపు