కూల్చివేసినా.. అది చంద్రబాబు సొంతిల్లు కాదు : మాజీ ఎంపీ రాయపాటి

| Edited By:

Jun 28, 2019 | 7:25 PM

వివాదాస్పదంగా మారిన అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం టీడీపీ నేతల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కి కూడా సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేసి గుంటూరు పార్టీ ఆఫీసుకు దగ్గర్లో ఉంటారని తెలిపారు. అక్రమ నిర్మాణాల పేరిట లింగమనేని గెస్ట్‌హౌస్‌కి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసినా అది చంద్రబాబుది కాదని, […]

కూల్చివేసినా.. అది చంద్రబాబు సొంతిల్లు కాదు : మాజీ ఎంపీ రాయపాటి
Follow us on

వివాదాస్పదంగా మారిన అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం టీడీపీ నేతల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కి కూడా సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేసి గుంటూరు పార్టీ ఆఫీసుకు దగ్గర్లో ఉంటారని తెలిపారు.
అక్రమ నిర్మాణాల పేరిట లింగమనేని గెస్ట్‌హౌస్‌కి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసినా అది చంద్రబాబుది కాదని, దానివల్ల ఆయనకు నష్టం ఏమీ లేదని, ఆయన ఖచ్చితంగా ఖాళీ చేస్తారని రాయపాటి తెలిపారు.

ఇదిలా ఉంటే తన ఇంటికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించానని తెలిపారు రాయపాటి. ఇప్పటికే ఆయన నివాసం కూల్చివేస్తారన్న విషయం తెలుసుకున్న చాలమంది రైతులు చంద్రబాబును కలిశారని, వెంకటపాలెం రైతులు ఏకంగా ఆయనకు ఇల్లుకడతామంటున్నారని  రాయపాటి తెలిపారు.

ఇప్పటికే అక్రమ నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను నేలమట్టం చేశారు అధికారులు. ఈ కూల్చివేతలు రాజకీయంగా అధికార టీడీపీ,ప్రతిపక్ష వైసీపీల మధ్య వివాదాన్ని రాజేసాయి. మరోవైపు కరకట్టపై నిర్మించిన కట్టడాల విషయంలో సీఆర్డీఏ నోటీసులు కూడా జారీ చేసింది.