Raviteja About Lockdown Time: ‘రాజా ది గ్రేట్’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక సతమతమవుతున్నాడు మాస్ మహా రాజా రవితేజ. 2017లో వచ్చిన ఈ చిత్రం తర్వాత రవి నాలుగు సినిమాల్లో నటించగా ఇవేవి ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లాక్‌డౌన్ సమయంలో మీరెలా గడిపారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘లాక్‌డౌన్ సమయం నాకు మాత్రం చాలా అద్భుతంగా గడిచింది. నేను సాధారణంగానే కుటుంబంతో ఎక్కువగా గడుపుతుంటాను. ఫ్యామిలీ మెన్‌ని. దీంతో అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా కుటుంబంతో గడపగలినాను. అలాగే హ్యాపీగా వర్కవుట్స్ చేసుకున్నాను. అంతేకాందు ఇంటర్నెట్‌లో చాలా కంటెంట్ ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో బోలేడు సినిమాలు చూశాను. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా బోర్‌గా ఫీల్ కాలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక రవితేజ తన కుమారుడి సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘రాజా ది గ్రేట్’లో అనిల్ పట్టుబట్టి మహాదన్‌తో ఆ పాత్ర చేయించాడు. ఇప్పుడు వాడు 9వ తరగతి చదువుతున్నాడు. సినిమాల్లో నటించడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ సమయానికి వాడికి ఏది అనిపిస్తే అదే చేయమని చెప్తాను’ అని చెప్పుకొచ్చాడీ స్టార్ హీరో. మరి ‘క్రాక్’తో నైనా రవితేజ నీరిక్షణ ఫలిస్తుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.
Also Read: Anushka Sharma: ఈ సమయంలోనూ ఫిట్నెస్పై ధ్యాస పెట్టి అనుష్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..