ఇకపై ఏపీలో ఇంటి ముందుకే రేషన్ సరుకులు.. తొమ్మిది వేల వాహనాలను సిద్ధం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇకపై రేషన్ సరుకుల కోసం ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన  అవసరం లేకుండా ఇంటికే సరుకులను చేరవేర్చే సరికొత్త పద్ధతిని తీసుకురానుంది.

ఇకపై ఏపీలో ఇంటి ముందుకే రేషన్ సరుకులు.. తొమ్మిది వేల వాహనాలను సిద్ధం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.

Updated on: Dec 21, 2020 | 5:36 PM

Ration door delivery in ap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇకపై రేషన్ సరుకుల కోసం ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన  అవసరం లేకుండా ఇంటికే సరుకులను చేరవేర్చే సరికొత్త పద్ధతిని తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల నుంచి కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సరికొత్త విధానాన్ని జనవరి 1 నుంచి అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే లబ్ధిదారుల ఇంటికే రేషన్ సరుకులను సరఫరా చేసేందుకు గాను ఏపీ ప్రభుత్వం ఏకంగా 9260 వాహానాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వాహనాల్లోనే తూకం వేసే కాంటాలను అమర్చనున్నారు. అంతేకాకుండా రేషన్ వాహనాలు వచ్చినట్లు ప్రజలకు తెలిసేలా మైక్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ కొత్త విధానం ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందో చూడాలి.