సరిగ్గా 13 ఏళ్ల క్రితం ముంబయిలో జరిగిన ఓ ఉగ్రదాడి భారతదేశంతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికించింది. దేశ ఆర్థిక రాజధానిని లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడిన ముష్కరులు 164 మందిని బలిగొన్నారు. ఇందులో భారతీయులతో పాటు విదేశీయులు ఉన్నారు. ఈ మారణహోమం జరిగి నాటికి 13 ఏళ్లు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ దారుణ సంఘటనను గుర్తుచేసుకుంటున్నారు. మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళి అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ముంబయి 26/11 విషాద ఘటనను తలచుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ముష్కరుల దాడిలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా అప్పటి ఉగ్రదాడుల్లో భారీగా దెబ్బతిన్న తాజ్ మహల్ ప్యాలెస్ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రతన్ టాటా..’13 ఏళ్ల క్రితం మనం అనుభవించిన బాధ ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే ఈ దాడిలో దూరమైన ఆత్మీయులను ఎప్పటికీ తిరిగి పొందలేం. కానీ మనం కోల్పోయిన వారిని గౌరవించడం ద్వారా మనల్ని నాశనం చేయడమే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడుల విషాధ స్మృతులను మన బలంగా మార్చుకోవచ్చు’ అని పిలుపునిచ్చారు.
Khewra Salt Mines: అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన అద్భుత పదార్థం.. నేడు వందల కోట్లలో వ్యాపారం..
Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..
Post Office: పోస్టాఫీసులో నెలకి 10,000 పెట్టండి..16 లక్షలు పొందండి..