AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Shocking Remunaration: అమితాబ్ సినిమా కోసం రష్మిక అంత తీసుకుంటోందా..? రెండో సినిమాతోనే..

Rashmika remuneration For Bollywood: కన్నడ సినిమాతో మొదలు పెట్టిన రష్మిక సినీ కెరీర్ టాలీవుడ్‌తో కీలక మలుపు తిరిగింది. తెలుగులో అనతికాలంలోనే..

Rashmika Shocking Remunaration: అమితాబ్ సినిమా కోసం రష్మిక అంత తీసుకుంటోందా..? రెండో సినిమాతోనే..
Narender Vaitla
|

Updated on: Dec 31, 2020 | 7:55 PM

Share

Rashmika remuneration For Bollywood: కన్నడ సినిమాతో మొదలు పెట్టిన రష్మిక సినీ కెరీర్ టాలీవుడ్‌తో కీలక మలుపు తిరిగింది. తెలుగులో అనతికాలంలోనే ఈ చిన్నది అగ్ర కథనాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. బడా హీరోల సరసన నటించే అవకాశాలు కొట్టేయడంతో పాటు ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి. దీంతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగు, తమిళ, కన్నడలో వరుస సినిమాలు చేస్తోన్న ఈ కన్నడ బ్యూటీ తాజాగా బాలీవుడ్‌లోనూ నటించే అవకాశం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందలో ఒకటి సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’ సినిమాకాగా.. అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మరో చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్మిక ఈ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందనేది సదరు వార్త సారంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక ఈ చిత్రంలో రష్మిక అమితాబ్‌కు కూతురిగా నటించనుంది. ఇదిలా ఉంటే మొదట ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ను తీసుకోవాలనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల కత్రినా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకేసారి రెండు సినిమాలతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న రష్మిక బీ టౌన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Monal Gajjar : ‘అల్లుడు అదుర్స్‌’లో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్..రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?