డాక్టర్ దిశ ఘటన తర్వాత అత్యాచారానికి పాల్పడే నిందితులకు మరణశిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఏపీలో ‘దిశ చట్టం 2019’ను కూడా అమలులోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం చేసినట్లు రుజువైతే.. విచారణ మొత్తాన్ని 21 రోజుల్లో కంప్లీట్ చేసి.. నిందితులకు మరణ శిక్ష విధించనున్నారు. మరోవైపు ఈ చట్టాన్ని మహారాష్ట్ర కూడా అమలు చేయనుంది. ఇక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా నాలుగేళ్ళ బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన మృగాడికి ప్రత్యేక న్యాయస్థానం కేవలం 17 రోజుల్లోనే శిక్ష విధించడం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌కు చెందిన దయారాం అనే వ్యక్తి నవంబర్ 30న నాలుగేళ్ళ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక పోలీసులు ఈ మృగాడిని అరెస్ట్ చేసి.. ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇక డిసెంబర్ 7వ తేదీన పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేయగా.. ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసుపై విచారణ చేపట్టి దయారాంను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ మంగళవారం తుదితీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష 17 రోజుల్లో పడగా.. పోలీసులు వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం.