పవన్‌కల్యాణ్‌కు మళ్ళీ రాపాక సర్‌ప్రైజ్

|

Feb 08, 2020 | 1:25 PM

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సొంత పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. పార్టీ అభిమతాన్ని, చివరికి అధినేత లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను ఇదివరకే బేఖాతరు చేసిన రాపాక.. తాజాగా మారోసారి పార్టీని ధిక్కరించారు. విపక్షంలో వుంటూ అధికారపక్షంతో అంటకాగారు రాపాక. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం కోసం రాజమండ్రికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాపాక వరప్రసాద్ సన్నిహితంగా తిరగడం అందరూ ఆశ్చర్యంగా చూశారు. పోలీస్ స్టేషన్ ప్రారంభానికి […]

పవన్‌కల్యాణ్‌కు మళ్ళీ రాపాక సర్‌ప్రైజ్
Follow us on

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సొంత పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. పార్టీ అభిమతాన్ని, చివరికి అధినేత లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను ఇదివరకే బేఖాతరు చేసిన రాపాక.. తాజాగా మారోసారి పార్టీని ధిక్కరించారు. విపక్షంలో వుంటూ అధికారపక్షంతో అంటకాగారు రాపాక.

దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం కోసం రాజమండ్రికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాపాక వరప్రసాద్ సన్నిహితంగా తిరగడం అందరూ ఆశ్చర్యంగా చూశారు. పోలీస్ స్టేషన్ ప్రారంభానికి వచ్చిన జగన్‌ను రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ప్రోగ్రామ్ అయ్యే వరకు రాపాక ముఖ్యమంత్రితోనే వుండడంతో వైసీపీ వర్గాలు, నేతలు సైతం ఆశ్చర్యపోయారు.

మూడు రాజధానుల బిల్లు శాసనసభ ముందుకు వచ్చినపుడు జనసేన అధినేత స్వయంగా రాపాకకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిపాదనను జనసేన వ్యతిరేకస్తున్న నేపథ్యంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పవన్ కల్యాణ్ జనవరి 20న రాపాకనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. అయితే, పవన్ కల్యాణ్ లేఖను ఏ మాత్రం ఖాతరు చేయని రాపాక.. మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లుకు అనుకూలంగా సభలో మాట్లాడారు. ఆ తర్వాత ఓటు కూడా వేశారు. మాట్లాడే ముందు.. సభలో మాట్లాడిన తర్వాత కూడా రాపాకా ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా సభలోనే కల్వడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.

తాజాగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రితో అధికార పార్టీ ఎమ్మెల్యే తరహాలు కలిసి తిరగడంతో మరోసారి రాపాక పార్టీ అధినేతకు సర్‌ప్రైజ్ ఇచ్చినట్లయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏకైక ఎమ్మెల్యే కాబట్టి తనపై ఎలాంటి చర్యలకు అవకాశం లేదని, ఆ మాట కొస్తే.. నేరుగా స్పీకర్‌కు లేఖ ఇవ్వడం ద్వారా జనసేన శాసనసభ పక్షాన్ని వైసీపీలో విలీనం చేసేందుకు రాపాక రెడీ అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాపాకపై జనసేన ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని చెప్పుకుంటున్నారు.