Ramya Pandian Got Movie Chance: ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే అందులో పాల్గొన్న వారికి మంచి అవకాశాలను తెచ్చిపెడుతోంది బిగ్‌బాస్ రియాలిటీ షో. తెలుగులో ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో పాల్గొన్న వారు మంచి ఆఫర్లు అందుకున్నారు. అంత వరకు పెద్దగా ప్రపంచానికి పరిచయం లేనివారికి కూడా బిగ్‌బాస్ ఎంతో ఫేమ్ తెచ్చిపెడుతోంది.
ఇక ఈ ఆఫర్లు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేవు.. తమిళ్‌లోనూ నటీనటులకు ఆఫర్లు క్యూకడుతున్నాయి. తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొన్న అందాల తార హీరోయిన్‌గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ తనెవరనేగా మీ సందేహం.. సోషల్ మీడియాలో తన ఫొటోలతో కుర్రకారు మతి పొగొడుతూ ఎప్పటికప్పుడు తన లెటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసే నటి రమ్య పాండియన్. ప్రస్తుతం ఈ బ్యూటీ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఈ నిర్మాణ సంస్థ ప్రముఖ హీరో సుర్యాకు చెందినది కావడం విశేషం. అరిసిల్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రమ్మ ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.