త్వరలో ప్రభుత్వం నుంచి తిరుమలకు విముక్తి : రమణ దీక్షీతులు

ఎప్పుడు సంచలనాలతో వార్తల్లోకి ఎక్కే టీటీడీ ప్రధాన పూజారి రమణ దీక్షీతులు మరోసారి హాట్ టాఫిక్ గా మారారు. తిరుమల శ్రీవారి ఆలయంలపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్‌కు తిరుమల శ్రీవారి గౌరవ ప్రధానార్ఛకులు రమణ దీక్షీతులు సమాదానమిచ్చారు

త్వరలో ప్రభుత్వం నుంచి తిరుమలకు విముక్తి : రమణ దీక్షీతులు

Updated on: Jul 07, 2020 | 3:51 PM

ఎప్పుడు సంచలనాలతో వార్తల్లోకి ఎక్కే టీటీడీ ప్రధాన పూజారి రమణ దీక్షీతులు మరోసారి హాట్ టాఫిక్ గా మారారు. తిరుమల శ్రీవారి ఆలయంలపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్‌కు తిరుమల శ్రీవారి గౌరవ ప్రధానార్ఛకులు రమణ దీక్షీతులు సమాదానమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు త్వరలో ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి పొందటానికి అనేక ఇతర దేవాలయాలను అనుసరిస్తాయని సుబ్రహ్మణ్య స్వామి సందేశాన్ని రమణ దీక్షితులు స్వాగతించారు. దీని స్వాగతించిన రమణ దీక్షీతులు ఉత్తరాఖండ్‌లాగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుమలకు విముక్తి లభించనుందని ఆయన పేర్కొన్నారు. చార్‌దామ్‌ సహా 54 దేవాలయాలను రాష్ట్ర పరిధి నుంచి తప్పించాలన్న.. పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉందంటూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి కృషిని రమణ దీక్షితులు అభినందించారు. ఇది సనాతన ధర్మ విజయంగా భావిస్తున్నట్టు రమణదీక్షితులు ట్వీట్‌ చేశారు. మరోవైపు రమణ దీక్షీతుల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.