దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ సంబరాలు..!

| Edited By:

Jun 05, 2019 | 1:28 PM

దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈద్ వేడుకలు మిన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్నారు. జామా మసీదుతో పాటు అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. జామామసీదులో జరిగిన ప్రార్ధనల్లో లక్షలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకంక్షలు తెలుపుకుంటున్నారు. రాష్ట్రపతి కోవింద్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రార్ధనల సందర్భాంగా ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు […]

దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ సంబరాలు..!
Follow us on

దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈద్ వేడుకలు మిన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్నారు. జామా మసీదుతో పాటు అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి.

జామామసీదులో జరిగిన ప్రార్ధనల్లో లక్షలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకంక్షలు తెలుపుకుంటున్నారు. రాష్ట్రపతి కోవింద్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రార్ధనల సందర్భాంగా ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

కోలకతాలో రంజాన్ ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి. రోడ్‌ రోడ్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం మమతాబెనర్జీ హాజరయ్యారు. మతసామరస్యానికి రంజాన్ పండుగ నిదర్శనమని అన్నారు మమత. మోదీ ఈవీఎంల సాయంతో నెగ్గారని మరోసారి ఆరోపించారు.

లక్నోలో జరిగిన ఈద్ ప్రార్థనలను ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

జమ్మూకాశ్మీర్‌లో కూడా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈద్‌ ఉల్ ఫితర్‌ను జరుపుకుంటున్నారు. శ్రీనగర్‌తో పాటు అన్ని నగరాల్లో కూడా ఘనంగా ఈద్ వేడుకలు నిర్వహిస్తున్నారు.

బీహార్ రాజధాని పాట్నాలో ఈద్ ఉల్ ఫితర్ సంబరాలు కలర్‌ఫుల్‌గా జరుగుతున్నాయి. ఉదయం నుంచే మసీదుల దగ్గరకు జనం పోటెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.