కొత్త ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌

మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ మంగళవారం భారత నూతన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందున్న ఎన్నికల కమిషనర్‌ అశోక్ లవాసా స్థానంలో రాజీవ్ కుమార్..

కొత్త ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌

Updated on: Sep 01, 2020 | 7:02 PM

మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ మంగళవారం భారత నూతన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందున్న ఎన్నికల కమిషనర్‌ అశోక్ లవాసా స్థానంలో రాజీవ్ కుమార్ ను నియమించారు. భారత న్యాయ మంత్రిత్వ శాఖ రాజీవ్ నియామకానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 లోని క్లాజ్ (2) ప్రకారం, శ్రీ రాజీవ్ కుమార్ (రిటైర్డ్‌ ఐఏఎస్‌)అధికారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించినట్టు పేర్కొంది. కాగా, ఏప్రిల్‌ 29న ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి రాజీవ్ రాజీనామా చేశారు. అనంతరం అతన్ని పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు.. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఆగస్టు 18 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగి అనంతరం రాజీనామా సమర్పించారు.

రాజీవ్‌ కుమార్‌ 1984లో జార్ఖండ్‌ కేడర్‌ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధి​కారి. ఆయనకు పబ్లిక్‌ పాలసీతో పాటు అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ‘మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ సస్టైనబిలిటీ’ తో పాటు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీల్లో ఆయన పట్టభద్రులు. ఎన్నికల కమిషనర్ గా నియమితులైన రాజీవ్‌ కుమార్‌కు పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలాఉంటే, భారత ఎన్నికల సంఘంలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా కాగా, ఎన్నికల కమిషనర్ గా సుశీల్ చంద్ర ఉన్నారు. తాజాగా మూడో సభ్యుడిగా రాజీవ్ కుమార్ భారత ఎన్నికల సంఘంలో చేరినట్లైంది.