దుర్గమ్మ నిమజ్జనం వేడుకల్లో విషాదం.. 10 మంది గల్లంతు
దసరా పండుగ వేళ రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. దోల్‌పూర్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వెళ్లి పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు. అధికారులు భారీ ఎత్తున గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికి తీశారు. మృతుల కుటుంబాలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరో మూడు మృతదేహాలను వెలికి తీసేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల చర్యలు కొనసాగుతున్నాయి. ముందుగా ఓ […]
దసరా పండుగ వేళ రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. దోల్‌పూర్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వెళ్లి పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు. అధికారులు భారీ ఎత్తున గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికి తీశారు. మృతుల కుటుంబాలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరో మూడు మృతదేహాలను వెలికి తీసేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల చర్యలు కొనసాగుతున్నాయి. ముందుగా ఓ బాలుడు నదిలో దూకాడు. ఆ బాలుడు మునిగిపోతుండగా కాపాడటానికి నదిలో దూకి 9 మంది మునిగిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, అమ్మవారి నిమజ్జనం కోసం వెళ్లిన వారు తిరిగిరాకపోవడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.