భార్యను కత్తెరతో అతి కిరాతకంగా చంపిన భర్త.. మృతదేహం పక్కనే వీడియో గేమ్‌ ఆడుతూ కూర్చొన్న నిందితుడు

భార్యను కత్తెరతో అతి కిరాతకంగా చంపాడు ఒక ప్రబుద్ధుడు. ఆమె డెడ్ బాడీని పక్కనే పెట్టుకొని మొబైల్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ కూర్చొన్నాడు.

  • Anil kumar poka
  • Publish Date - 3:13 pm, Tue, 8 December 20
భార్యను కత్తెరతో అతి కిరాతకంగా చంపిన భర్త.. మృతదేహం పక్కనే వీడియో గేమ్‌ ఆడుతూ కూర్చొన్న నిందితుడు

భార్యను కత్తెరతో అతి కిరాతకంగా చంపాడు ఒక ప్రబుద్ధుడు. ఆమె డెడ్ బాడీని పక్కనే పెట్టుకొని మొబైల్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ కూర్చొన్నాడు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ ఘటన ​చోటు చేసుకుంది. విక్రమ్‌ సింగ్‌ అనే వ్యక్తి తన భార్య శివ కన్వర్‌, బీజేస్‌ కాలనీలో ఉంటున్నాడు. విక్రమ్‌కు ఏ పని చేయకపోవడంతో ఆయన భార్య రోజూ మందలించేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తాజాగా చిన్న గొడవైంది. దీంతో విక్రమ్‌ సింగ్‌ ఆమెను అతిదారుణంగా చంపాడు. కత్తెరతో ఆమెను పొడిచాడు. తర్వాత తన అత్త మామలకు సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా ఆమె రక్తపు మడుగుల్లో పడి ఉంది. అయితే అప్పుడు నిందితుడు ఆమె మృతదేహం పక్కనే వీడియో గేమ్‌ ఆడుతూ ఉన్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.