తమకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలంటూ రాజస్థాన్ లో గుజ్జర్లు మళ్ళీ ఆందోళనబాట పట్టారు. ఆదివారం భరత్ పూర్ లో అనేకమంది రైల్వే పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళన కారణంగా వివిధ రైళ్ల షెడ్యూలును అధికారులు మార్చవలసి వచ్చింది. అవధ్ ఎక్స్ ప్రెస్, ఢిల్లీ-ముంబై-రాజధాని ఎక్స్ ప్రెస్ వంటి రైళ్ల షెడ్యూలును మార్చినట్టు అధికారులు తెలిపారు. 2007 నుంచే గుజ్జర్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సీఎం అశోక్ గెహ్లాట్ తో తమ డిమాండ్ల విషయమై మాట్లాడామని, కానీ ప్రయోజనం లేకపోయిందని గుజర్ల నేత విజయ్ బైన్ స్లా చెప్పారు.