CAA Protest: సీఏఏ ‘మంట’… అవసరమైతే నేనూ డిటెన్షన్ సెంటర్‌కి వెళ్తా.. అశోక్ గెహ్లాట్

CAA Protest: సవరించిన పౌరసత్వ చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. దేశంలోశాంతి, సామరస్యాలను కాపాడాలంటే వెంటనే ఈ చర్య తీసుకోవాలన్నారు. సీఏఏని నిరసిస్తూ జైపూర్లో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగ విరుధ్దమైన ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం  పునరాలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమవెంటే ఉన్నాయని ఆయన చెప్పారు. ఎన్‌పీ‌ఆర్ కోసం తలిదండ్రుల జన్మ స్థలానికి సంబంధించిన సమాచారాన్ని కోరుతున్నారని, […]

CAA Protest: సీఏఏ మంట... అవసరమైతే నేనూ డిటెన్షన్ సెంటర్‌కి వెళ్తా.. అశోక్ గెహ్లాట్

Edited By:

Updated on: Feb 15, 2020 | 9:59 AM

CAA Protest: సవరించిన పౌరసత్వ చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. దేశంలోశాంతి, సామరస్యాలను కాపాడాలంటే వెంటనే ఈ చర్య తీసుకోవాలన్నారు. సీఏఏని నిరసిస్తూ జైపూర్లో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగ విరుధ్దమైన ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం  పునరాలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమవెంటే ఉన్నాయని ఆయన చెప్పారు. ఎన్‌పీ‌ఆర్ కోసం తలిదండ్రుల జన్మ స్థలానికి సంబంధించిన సమాచారాన్ని కోరుతున్నారని, అయితే ఆ వివరాలను తాను అందజేయలేనన్నారు. అలాంటప్పుడు నన్ను కూడా డిటెన్షన్ సెంటర్ కు వెళ్లాలని కేంద్రం కోరవచ్ఛునని సెటైర్ వేశారు. నా తలిదండ్రుల బర్త్ ప్లేస్ ఏదో నాకు తెలియదు.. అందుకే సమయమే వస్తే.. నిర్బంధ శిబిరానికి వెళ్లే వారిలో నేనే మొదటివాడినవుతా అని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు.

ఎన్నార్సీని అమలు చేసేందుకు అస్సాం ప్రభుత్వం నిరాకరించిన విషయాన్ని   ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలోనో షాహీన్ బాగ్ లోను, దేశంలో ఇతర చోట్ల సీఏఏకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని గెహ్లాట్ సూచించారు. ఇన్ని రోజులైనా నిరసనలు ఆగని విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు.