సమ్మర్ లో రెయిన్స్… బీ అలర్ట్

| Edited By:

May 13, 2019 | 5:40 PM

రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తేమ గాలులు వీస్తున్నాయని, వీటికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మైదాన ప్రాంతాల్లో ఈ వర్షాలు అధికంగా కురుస్తాయని తెలిపారు. కాగా, ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు […]

సమ్మర్ లో రెయిన్స్... బీ అలర్ట్
Follow us on

రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తేమ గాలులు వీస్తున్నాయని, వీటికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మైదాన ప్రాంతాల్లో ఈ వర్షాలు అధికంగా కురుస్తాయని తెలిపారు. కాగా, ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను చిరు జల్లులు పలకరించగా, ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.