‘పిజ్జా డెలివరీ మోడల్’ ఫాలో కానున్న ఇండియన్ రైల్వే!

| Edited By:

Aug 19, 2020 | 5:47 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సరుకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు భారత రైల్వే ఓ వినూత్న ఆలోచన చేసింది. గూడ్స్‌ రవాణా ఆదాయాన్ని పెంచుకునేందుకు

పిజ్జా డెలివరీ మోడల్ ఫాలో కానున్న ఇండియన్ రైల్వే!
Follow us on

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సరుకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు భారత రైల్వే ఓ వినూత్న ఆలోచన చేసింది. గూడ్స్‌ రవాణా ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను ఇకపై డొమినోస్ పిజ్జా డెలివరీ మోడల్‌ను అవలంబించన్నట్లు తెలుస్తోంది. అంటే జాతీయ రవాణాదారు ఉత్పత్తులతో పాటు, వస్తువులను నిర్థిష్టకాలంలో రవాణా చేయడమే కాకుండా ఆలస్యం జరిగితే తగిన పరిహారం కూడా రైల్యే శాఖ చెల్లించనుంది. ఈ పరిహారం గంటల ప్రాతిపదికన ఉంటుంది.

వివరాల్లోకెళితే.. వస్తువుల పంపిణీకి రైల్యే నిర్ణీత కాలపరిమితిని నిర్ణయిస్తుంది. ఆ సయయానికి వస్తువుల పంపిణీ జరగకపోతే ప్రతి గంట చొప్పున వినియోగదారులకు పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు ముంబై నుండి న్యూఢిల్లీకి సరుకులు రవాణాకు గరిష్టంగా 3 రోజులు (72 గంటలు) పడుతుంది. ఒకవేళ ఈ 72 గంటలలోపు సరుకులను పంపిణీ చేయకపోతే, నిర్ణీత గడువు ముగిసిన ప్రతి గంట ఆలస్యానికి రైల్వే పరిహారం చెల్లిస్తుంది.