రైలు ప్రయాణికులకు షాక్.. త్వరలో ఛార్జీల పెంపు?

| Edited By:

Dec 28, 2019 | 5:33 AM

రైల్వేశాఖ.. తాజాగా ప్యాసింజర్ టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్యాసింజర్ రైళ్లతో పాటు సరకు రవాణా చార్జీలను త్వరలోనే సవరిస్తామని గురువారం రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు పెంచి ఐదేళ్లు దాటిందని, ఈసారి రైళ్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఐతే సరుకు రవాణా రేట్లు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి.. సరకు రవాణా చార్జీలను స్వల్పంగా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అయితే, […]

రైలు ప్రయాణికులకు షాక్.. త్వరలో ఛార్జీల పెంపు?
Follow us on

రైల్వేశాఖ.. తాజాగా ప్యాసింజర్ టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్యాసింజర్ రైళ్లతో పాటు సరకు రవాణా చార్జీలను త్వరలోనే సవరిస్తామని గురువారం రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు పెంచి ఐదేళ్లు దాటిందని, ఈసారి రైళ్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఐతే సరుకు రవాణా రేట్లు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి.. సరకు రవాణా చార్జీలను స్వల్పంగా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

అయితే, గురువారం రైల్వే బోర్డు ప్రతినిధి ఆర్ డి బాజ్‌పాయ్ మాట్లాడుతూ “ఛార్జీలు పెంచే ప్రతిపాదన లేదు”. “ఛార్జీల హేతుబద్ధీకరణ అనేది ఒక ఆలోచన, దీని అర్థం ఛార్జీలు పెరుగుతాయని కాదు” అని చెప్పారు. అయితే.. రైల్వేలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున ప్రభుత్వానికి ఛార్జీలు పెంచే ప్రతిపాదన ఉంది.