శ్రీలంక పేలుళ్లతో భారత్‌లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఉగ్ర సంబంధాలు ఉన్న వారి నడవడిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు. ఐసిస్ మాడ్యూల్ కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.