న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పినా.. సుప్రీంకోర్టు మాత్రం సంతృప్తి చెందలేదు. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన కేసులో రాహుల్‌కు సుప్రీం.. కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. రాఫెల్ విమానాల కేసులో చౌకీదార్ చోర్ హై అని సుప్రీంకోర్టు చెప్పినట్లు రాహుల్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అయితే సుప్రీం చెప్పిన వ్యాఖ్యలను అక్రమపద్ధతిలో ప్రచారం చేస్తున్నరాని రాహుల్‌పై మీనాక్షి కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఆ కేసులో సోమవారం రాహుల్ సుప్రీంకు క్షమాపణలు చెప్పారు. కానీ రాహుల్ తీరులో పశ్చాత్తాపం లేదని ఇవాళ సుప్రీం వెల్లడించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 30వ తేదీన ఉంటుందని కోర్టు తెలిపింది.