బ్రదర్..జగన్‌ని అభిమానిస్తాం : పీపుల్ స్టార్

|

Aug 17, 2019 | 7:52 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కానీ తాము అభిమానిస్తామన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత కొద్దిరోజుల నుండి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఎన్నికవడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరికి ఇష్టం లేదంటూ ఆ పార్టీ నేత, నటుడు పృథ్వీ  కామెంట్స్ చేశారు. ఈ విషయంపై ఫిల్మ్ ఇండస్ట్రీలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు […]

బ్రదర్..జగన్‌ని అభిమానిస్తాం : పీపుల్ స్టార్
R Narayana Murthy About Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కానీ తాము అభిమానిస్తామన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత కొద్దిరోజుల నుండి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఎన్నికవడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరికి ఇష్టం లేదంటూ ఆ పార్టీ నేత, నటుడు పృథ్వీ  కామెంట్స్ చేశారు. ఈ విషయంపై ఫిల్మ్ ఇండస్ట్రీలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు నారాయణ మూర్తి ముందు ప్రస్తావించగా.. దీనికి ఆయన సమాధానం ఇస్తూ ఏపీకి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అభిమానిస్తామని చెప్పారు. ప్రస్తుతం జగన్ గారు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆయనను కూడా గౌరవిస్తామన్నారు. సినీ పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తేడాలుండవని… ఉత్తరాంధ్రకు గోదావరి జలా తరలింపు వల్ల ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.