కరోనా సేఫ్టీ మాస్క్ పెట్టుకోమని సంత్ రాజ్ యాదవ్ అనే లేబర్ కాంట్రాక్టర్ ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పంజాబ్ లోని జిరాక్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఇంటికి వచ్చిన సంత్ రాజ్ లేబర్ పనిఉంది రమ్మంటూ బాలిక తల్లిదండ్రులకు చెప్పి సదరు మైనర్ బాలికను పని ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇక్కడ మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే నని చెప్పి.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం మత్తమందు చల్లిన మాస్క్ ను ఆమెకు అందజేశాడు. కామాంధుడి పన్నాగం తెలీని బాలిక మాస్కు పెట్టుకున్న కాసేపటికి బాలిక స్పృహ కోల్పోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఆగష్టు 29న ఈ ఘటన జరుగగా, ఆందోళనగా కనిపిస్తోన్న బాలికను తల్లి, ప్రశ్నించగా విషయం చెప్పింది. దీంతో బలాత్కారానికి ఒడిగట్టిన వ్యక్తిపై జిరాక్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. సంత్ రాజ్ యాదవ్‌పై భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 376 (అత్యాచారం) లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు.