పంజాబ్ లో ఒక్కరోజే 217 కరోనా పాజిటివ్ కేసులు

పంజాబ్ లో గత 24 గంటల్లో 217 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం 3,832 మంది కరోనా బారినపడ్డారు.

పంజాబ్ లో ఒక్కరోజే 217 కరోనా పాజిటివ్ కేసులు

Updated on: Jun 19, 2020 | 11:06 PM

ఇంతకాలం తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న పంజాబ్ లో ఒక్కసారిగా కొత్త కేసులు రెట్టింపు అయ్యాయి. ఇవాళ ఒక్కరోజు 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు 100 కూడా దాటని కేసులు రెట్టింపు అవ్వడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4వేలకు చేరువైంది. గత 24 గంటల్లో 217 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం 3,832 మంది కరోనా బారినపడ్డారు. ఇవాళ కరోనాతో 9 మంది ప్రాణాలు కోల్పోయారని.. దీంతో ఇప్పటి వరకు మొత్తం 92 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ప్రస్తుతం 1,104మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 2,636మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Loading...
Unable to load recommendations.
Follow Us