AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాలక్ష్మి అమ్మవారికి 16 కిలోల బంగారు చీర.. 2 కిలోల రత్నాల కిరీటం ప్రత్యేకత ఇదే!

Pune Mahalakshmi Temple Special: పుణెలోని సారస్‌బాగ్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని 16 కిలోల బంగారు చీర, సుమారు 2 కిలోల రత్నాల కిరీటంతో అలంకరించారు. ఆరు నెలల శ్రమతో హైదరాబాద్ కళాకారులు రూపొందించిన ఈ బంగారు చీర వెనుక ఉన్న ప్రత్యేకత, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం గురించి తెలుసుకుందాం.

మహాలక్ష్మి అమ్మవారికి 16 కిలోల బంగారు చీర.. 2 కిలోల రత్నాల కిరీటం ప్రత్యేకత ఇదే!
Pune Mahalakshmi Temple Special
Rajashekher G
|

Updated on: Oct 21, 2026 | 1:18 PM

Share

భారతదేశంలో శరన్నవరాత్రులు, విజయదశమి వేడుకలు భక్తి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ పర్వదినాల్లో దేశంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహిస్తారు. అలాంటి విశిష్టమైన సంప్రదాయాల్లో మహారాష్ట్రలోని పుణె నగరంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయ అలంకరణ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ కొలువైన అమ్మవారిని ఏకంగా 16 కిలోల బరువున్న బంగారు చీరతో అలంకరించడం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీనికి తోడు రత్నాలతో రూపొందించిన సుమారు 2 కిలోల బరువున్న కిరీటం అమ్మవారి దివ్య రూపానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.

బంగారు చీరలో మహాలక్ష్మి అమ్మవారి దివ్య రూపం

పుణెలోని ప్రసిద్ధ సారస్‌బాగ్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నవరాత్రులు, దసరా సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఈ క్రమంలో అమ్మవారికి బంగారు చీరను అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. బంగారు ఆభరణాలతో ప్రకాశించే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయ ట్రస్టీ, న్యాయవాది ప్రతాప్ పరదేశి తెలిపిన వివరాల ప్రకారం, దసరా సందర్భంగా బంగారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయానికి ఈ ప్రత్యేక అలంకరణతో సంబంధం ఉంది. ఆలయ ట్రస్టు ఏడాదికి రెండుసార్లు అమ్మవారిని ఈ బంగారు చీరతో అలంకరిస్తుంది. దసరా, లక్ష్మీ పూజ సందర్భాల్లో ఈ విశేష అలంకరణ నిర్వహిస్తారు.

ఆరు నెలల శ్రమతో రూపుదిద్దుకున్న బంగారు చీర

ఈ బంగారు చీరను హైదరాబాద్‌కు చెందిన కళాకారులు ఎంతో నైపుణ్యంతో రూపొందించారు. దీని తయారీకి సుమారు ఆరు నెలల సమయం పట్టినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం 16 కిలోల బరువున్న ఈ చీరను సుమారు 17 ఏళ్ల క్రితం తయారు చేయించారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ కమిటీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.

రత్నాల కిరీటంతో ప్రత్యేక ఆకర్షణ

బంగారు చీరతో పాటు అమ్మవారికి రత్నాలతో అలంకరించిన ప్రత్యేక కిరీటాన్ని కూడా ధరింపజేస్తారు. సుమారు 2 కిలోల బరువున్న ఈ కిరీటాన్ని నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు అమ్మవారి శిరస్సుపై ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. బంగారు చీర, రత్నాల కిరీటంతో అలంకరించిన మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం భారతీయ ఆలయ సంస్కృతిలోని వైభవాన్ని, భక్తుల విశ్వాసాన్ని చాటిచెబుతోంది.

Follow Us
మహాలక్ష్మి అమ్మవారికి 16 కిలోల బంగారు చీర.. 2 కిలోల రత్నాల కిరీటం
మహాలక్ష్మి అమ్మవారికి 16 కిలోల బంగారు చీర.. 2 కిలోల రత్నాల కిరీటం
సౌరవ్ గంగూలీ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన జో రూట్
సౌరవ్ గంగూలీ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన జో రూట్
500 కోట్ల క్లబ్‌లో జైలర్ 2..రజనీ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్ల తెలుసా?
500 కోట్ల క్లబ్‌లో జైలర్ 2..రజనీ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్ల తెలుసా?
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాల్సిందేః మంత్రి సీతక్క
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాల్సిందేః మంత్రి సీతక్క
మీ నివాస ప్రాంతం మీ ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుంది? నమ్మలేని నిజాలు
మీ నివాస ప్రాంతం మీ ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుంది? నమ్మలేని నిజాలు
వ్యాపారం నష్టాల నుంచి లాభాల బాట పట్టాలంటే? చాణక్యుడు చెప్పిన..
వ్యాపారం నష్టాల నుంచి లాభాల బాట పట్టాలంటే? చాణక్యుడు చెప్పిన..
కర్రె గేదె కడుపున పుట్టిన తెల్లటి దూడ! ఎందువలనా అంటే..
కర్రె గేదె కడుపున పుట్టిన తెల్లటి దూడ! ఎందువలనా అంటే..
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!
వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?
వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?