AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో వింత సంఘటన.. కర్రె గేదె కడుపున పుట్టిన తెల్లటి దూడ! ఎందువలనా అంటే..

ప్రకృతిలో ఒక్కోసారి ఊహించని అద్భుతాలు, వింతలు చోటుచేసుకుంటాయి. సాధారణంగా గేదెలు నల్లటి గేదె దూడలకే జన్మనివ్వడం మనం చూస్తుంటాం. కానీ, కర్ణాటకలోని ఓ ప్రాంతంలో మాత్రం ప్రకృతి నియమానికి భిన్నంగా ఒక వింత సంఘటన వెలుగు చూసింది. ఇక్కడి ఒక నల్లటి గేదె కడుపున పూర్తి తెల్లటి రంగులో ఉండే ఎద్దు దూడ జన్మించడంతో స్థానిక ప్రజలు, పశుపోషకులు తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇదో వింత సంఘటన.. కర్రె గేదె కడుపున పుట్టిన తెల్లటి దూడ! ఎందువలనా అంటే..
Black Buffalo White Calf
Jyothi Gadda
|

Updated on: Oct 21, 2026 | 12:55 PM

Share

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా, హుణసగి తాలూకా నారాయణపూర్ గ్రామంలో ఒక వింత, అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడి రైతు పరశురామ్‌కు చెందిన నల్లటి గేదె, తెల్లటి ఎద్దు దూడకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ అరుదైన వింత దూడను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సంఘటన వివరాల్లోకి వెళితే..

యాద్గిర్ జిల్లా హుణసగి తాలూకా పరిధిలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన పరశురామ్ అనే రైతుకు ఒక నల్లటి గేదె ఉంది. సుమారు 10 నెలల గర్భావధి కాలం తర్వాత ఈ గేదె ఇటీవల ఈనింది. అయితే, జన్మించిన దూడను చూసి రైతు పరశురామ్ తో పాటు కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆ దూడ గేదె దూడలా కాకుండా, ఆవు కోడె/ఎద్దు దూడ రూపురేఖలతో, ఒంటిపై నలుపు చాయ లేకుండా పూర్తి తెల్లటి రంగులో ఉంది.

కారణమేమై ఉంటుంది?

ఈ వింత జన్మ వెనుక ఉన్న కారణాన్ని పరిశీలిస్తే, రైతు పరశురామ్ తన పొలంలో గేదెతో పాటు ఎద్దును కూడా ఒకే చోట కట్టివేసేవాడని తెలుస్తోంది. ఎద్దు సంపర్కం పొంది ఉండటం వల్లే గేదె కడుపున తెల్లటి ఎద్దు దూడ జన్మించి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తరలివస్తున్న ప్రజలు:

నల్ల గేదెకు తెల్లటి ఎద్దు దూడ పుట్టిందనే వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించింది. విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఈ వింత జీవిని చూసేందుకు పరశురామ్ ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చాలామంది దీనిని అరుదైన ప్రకృతి అద్భుతంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వింత దూడకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కర్రె గేదె కడుపున పుట్టిన తెల్లటి దూడ! ఎందువలనా అంటే..
కర్రె గేదె కడుపున పుట్టిన తెల్లటి దూడ! ఎందువలనా అంటే..
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!
వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?
వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?
పాలకూర ఉల్లి కారం.. అన్నం, చపాతీ రెండింటిల్లోకి పర్ఫెక్ట్ కాంబో
పాలకూర ఉల్లి కారం.. అన్నం, చపాతీ రెండింటిల్లోకి పర్ఫెక్ట్ కాంబో
'గరివిడి లక్ష్మి'ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
'గరివిడి లక్ష్మి'ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఉల్లిపాయలు తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను క్షణాల్లో పోగొట్టే
ఉల్లిపాయలు తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను క్షణాల్లో పోగొట్టే
రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు
రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!