Weight Loss Surgery: వెయిట్‌లాస్‌ సర్జరీ వికటించి 26 ఏళ్ల యువకుడు మృతి.. ఆస్పత్రి నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం..

బరువు తగ్గేందుకు ఆస్పత్రిని ఆశ్రయించిన యువకుడు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. ఈ కేసులో యువకుడి మృతిపై విచారణకు ఇద్దరు జాయింట్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ఆదేశించింది. యువకుడి మృతిపై 2 రోజుల్లోగా విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సరైన చికిత్స అందించకపోవడం వల్లే మృతి చెందినట్టుగా అతని కుటుంబ సభ్యులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Weight Loss Surgery: వెయిట్‌లాస్‌ సర్జరీ వికటించి 26 ఏళ్ల యువకుడు మృతి.. ఆస్పత్రి నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం..
Surgery
Follow us

|

Updated on: Apr 26, 2024 | 3:04 PM

బరువు తగ్గేందుకు ఆస్పత్రిని ఆశ్రయించిన యువకుడు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. బరువు తగ్గించే శస్త్రచికిత్సలో 26 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆపరేషన్‌ చేసిన 15 నిమిషాల్లోనే యువకుడు మృతి చెందాడు. పుదుచ్చేరికి చెందిన 26ఏళ్ల హేమచంద్రన్ అనే యువకుడు చెన్నైలోని పమ్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బరువు తగ్గడానికి చికిత్స చేయించుకున్నాడు. అయితే చికిత్స ప్రారంభించిన 15 నిమిషాలకే అతనికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దాంతో హేమచంద్రన్‌ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కేసులో యువకుడి మృతిపై విచారణకు ఇద్దరు జాయింట్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ఆదేశించింది. యువకుడి మృతిపై 2 రోజుల్లోగా విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సరైన చికిత్స అందించకపోవడం వల్లే మృతి చెందినట్టుగా అతని కుటుంబ సభ్యులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అసలు విషయం ఏంటంటే..?

పుదుచ్చేరి నివాసి అయిన హేమచంద్రన్ వయస్సు 26 సంవత్సరాలు, కానీ అతని బరువు 150 కిలోలు. అటువంటి పరిస్థితిలో హేమచంద్రన్ బరువు తగ్గించే శస్త్రచికిత్స ద్వారా వెయిట్‌ తగ్గాలని ఆశపడ్డాడు. బరువు తగ్గేందుకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదించాడు. బరువు తగ్గడం కోసం సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అందుకు గానూ రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దాంతో అతను పమ్మల్‌లోని మరో ఆస్పత్రిని సందర్శించాడు. ఇక్కడ ఈ సర్జరీ కోసం రూ.4లక్షల ఖర్చు అవుతుందని తెలిసింది. దాంతో ఏప్రిల్ 3న అక్కడికి వెళ్లాడు హేమచంద్రన్. అనంతరం ఆ ఆస్పత్రిలోనే హేమచంద్రన్​ శస్త్ర చికిత్సకు కావాల్సిన వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం హేమచంద్రన్​కు మధుమేహం ఎక్కువగా ఉందని, తర్వాత సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారు. దాంతో వైద్యులు చెప్పినట్లుగా కొన్ని రోజుల తర్వాత ఏప్రిల్ 21న ఉదయం ఆస్పత్రికి వెళ్లాడు హేమచంద్రన్. ఆ తర్వాత రోజు సర్జరీ.

ఇవి కూడా చదవండి

అన్ని టెస్టుల అనంతరం అతన్ని అడ్మిట్‌ చేసుకున్న ఆసుపత్రి వర్గాలు..మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఆపరేషన్ థియేటర్‌లో హేమచంద్రన్‌కు మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీ ప్రారంభించారు. ఆపరేషన్‌ మధ్యలోనే హేమచంద్రన్ ఒక్కసారిగా ఆస్వస్థతకు గురయ్యాడు. వెంటనే డాక్టర్లు అతన్ని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హేమచంద్రన్ గుండెపోటుతో మరణించాడు. దీంతో తన కుమారుడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ శంకర్​నగర్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సరైన వైద్యం అందించని డాక్లర్లు, శస్త్రచికిత్స జరిగిన పమ్మల్‌లోని సంబంధిత ఆసుపత్రిపైనా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

రిపోర్టులు, టెస్ట్‌ రిజల్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నామని ఆసుపత్రిలో ఉన్న సీనియర్ డాక్టర్ చెప్పారు. కాగా, తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం గురువారం హరిచంద్రన్ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. హేమచంద్రన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. అతడి మృతిపై పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పారు. కుమారుడి మృతితో తల్లడిల్లిపోతున్న ఆ తల్లిదండ్రులకు ఓదార్పునందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు