క‌రోనాకు వెరవ‌ని ధీరులు.. బ్యాంకు ఉద్యోగులకు రూ.20లక్షల బీమా..!

|

Apr 21, 2020 | 3:22 PM

కరోనా వీర‌విహారం చేస్తున్న‌ప్ప‌టికి వెర‌వ‌కుండా డ్యూటీ చేస్తోన్న‌ తమ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ బీమా కవరేజీని అందిస్తున్నట్లు ఆర్థిక శాఖ ట్విట్టర్​లో పేర్కొంది. ఎంప్లాయిస్ సంరక్షణకు బ్యాంకులు కట్టుబడి ఉన్నట్లు వెల్ల‌డించింది. సిబ్బంది కోసం స్పెష‌ల్ గా డాక్ట‌ర్ల‌ను నియమించడమే కాకుండా.. ఒక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దురదృష్టవశాత్తు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఎంప్లాయిస్ కోవిడ్-19 సోకి మరణిస్తే భారీ స్థాయిలో బీమా పరిహారాన్ని అందజేయనున్నట్లు ఒక ట్వీట్‌లో ఆర్థిక […]

క‌రోనాకు వెరవ‌ని ధీరులు.. బ్యాంకు ఉద్యోగులకు రూ.20లక్షల బీమా..!
Follow us on

కరోనా వీర‌విహారం చేస్తున్న‌ప్ప‌టికి వెర‌వ‌కుండా డ్యూటీ చేస్తోన్న‌ తమ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ బీమా కవరేజీని అందిస్తున్నట్లు ఆర్థిక శాఖ ట్విట్టర్​లో పేర్కొంది. ఎంప్లాయిస్ సంరక్షణకు బ్యాంకులు కట్టుబడి ఉన్నట్లు వెల్ల‌డించింది. సిబ్బంది కోసం స్పెష‌ల్ గా డాక్ట‌ర్ల‌ను నియమించడమే కాకుండా.. ఒక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

దురదృష్టవశాత్తు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఎంప్లాయిస్ కోవిడ్-19 సోకి మరణిస్తే భారీ స్థాయిలో బీమా పరిహారాన్ని అందజేయనున్నట్లు ఒక ట్వీట్‌లో ఆర్థిక శాఖ వెల్ల‌డించింది. ఏ బ్యాంకుకాబ్యాంకు తమ ఎంప్లాయిస్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ బీమా కవరేజీని నిర్ణయించినట్లు స‌మాచారం. కాగా ఇది రూ.20 లక్షల వరకు ఉండొచ్చని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.